ETV Bharat / sitara

ప్రముఖ బుల్లితెర నటికి కరోనా పాజిటివ్ - నవ్య స్వామి కరోనా

ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని అన్నారు. ఒకవేళ వ్యాధి సోకినా భయపడాల్సిన పని లేదన్నారు.

Telugu Television actress Navya Swamy who has tested positive for Covid19
నవ్య
author img

By

Published : Jul 2, 2020, 1:33 PM IST

Updated : Jul 2, 2020, 2:32 PM IST

దేశంలో కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షలు దాటేసింది. సామాన్యుల నుంచి మంత్రులు, సినీ నటులు ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే ఎంతో ఉత్తమమని అన్నారు. ఒక వేళ వ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదన్నారు.

"కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోకండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారిన పడటం కన్నా ముందు జాగ్రత్త ఎంతో అవసరం. ఒకవేళ మీలో ఎవరైనా కరోనా పాజిటివ్‌ అని తెలిసినా విచారించాల్సిన అవసరం లేదు. దృఢంగా ఉండండి. స్వీయ గృహ నిర్బంధంలో ఉండండి. మీతోటి వారికి దూరంగా ఉండండి. అప్పుడే మార్పు సాధ్యం. మీ ప్రేమాభిమానాల వల్ల నేను బాగున్నా. త్వరలోనే మరింత దృఢంగా మీ ముందుకు వస్తా."

-నవ్య స్వామి, నటి

నవ్యతో పాటు ఇటీవల సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఇతర నటీనటులను కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంచారు. నవ్య స్వామి తెలుగులో పలు సీరియల్స్‌తో పాటు, వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు.

  • Noted Telugu Television actress Navya Swamy who has tested positive for Covid19 has urged people to take precautions and stay away from negative.

    She says there is nothing to fear even if you test COVID19 positive. pic.twitter.com/Q1Hbjczq78

    — BARaju (@baraju_SuperHit) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 2, 2020, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.