టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు అలీ త్వరలో హాలీవుడ్ చిత్రంలో ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. దానేటి జగదీశ్ దర్శకత్వంలో మార్టిన్ ఫిలిమ్స్ అధినేత జానీ మార్టిన్, పింక్ జాగ్వార్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థల సహకారంతో ఓ చిత్రం తెరకెక్కనుందట. ఇది ఇండో-అమెరికన్ నేపథ్యంలో తీయనున్నట్లు అలీ వెల్లడించాడు.
శుక్రవారం దిల్లీలోని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. అనంతరం చిత్ర షూటింగ్కు సంబంధించిన లోకేషన్లపై చర్చించినట్లు చెప్పాడు. చిత్రీకరణ అనుమతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అలీ చెప్పాడు.