ETV Bharat / sitara

Pushpa: 'పుష్ప' విడుదల తేదీ ఖరారు - పుష్ప పార్ట్ 1 రిలీజ్​

అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్​ ఎప్పుడా!.. అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం.

Pushpa part 1 release date
పుష్ప పార్ట్​ 1 రిలీజ్​ డేట్​
author img

By

Published : Aug 3, 2021, 1:57 PM IST

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. ‘

Pushpa part 1
పుష్ప పార్ట్​ 1

'పుష్ప పార్ట్‌ 1' ఈ డిసెంబరులో.. 'తగ్గేదే లే' అని పేర్కొంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడటం వల్ల డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ సినిమాలోని తొలిగీతం ఆగస్టు 13న విడుదల కానుంది.

ఇవీ చదవండి:Pushpa Allu arjun: 'పుష్ప' షూటింగ్ రీస్టార్ట్.. తగ్గేదే లే

'పుష్ప' సెట్​లో అనసూయ.. థియేటర్లలోనే 'గల్లీరౌడీ'

సీక్వెల్స్ ట్రెండ్.. స్టార్ దర్శకులూ అదే దారిలో!

'పుష్ప' ఐటమ్ సాంగ్​ కోసం సన్నీ లియోనీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.