*నాని 29వ సినిమా(nani new movie) ప్రకటన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నాని ట్వీట్ చేశారు. సుకుమార్(sukumar movies) శిష్యుడు శ్రీకాంత్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారట! ఈ సినిమాలో నాని సింగరేణి కుర్రాడి తెలంగాణ యాసతో అలరించనున్నట్లు తెలుస్తోంది.
*'భీమ్లా నాయక్'లోని(bheemla nayak release date) 'అంత ఇష్టం' పాట ప్రోమో.. గురువారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. పవన్(pawan kalyan new movie)-నిత్యమేనన్ ఈ గీతంలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్(trivikram movies) మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి రానుంది.
*ఆశిష్, అనుపమ(anupama parameswaran movies) జంటగా నటించిన 'రౌడీబాయ్స్' షూటింగ్ బుధవారంతో పూర్తయింది. ఆది-పాయల్ రాజ్‌పుత్(payal rajput movie list) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా టైటిల్- ఫస్ట్‌లుక్ అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
*'పెళ్లి సందD'(pelli sandadi 2021 heroine) సినిమాలోని 'గంధర్వ లోకాల' అంటూ సాగే పూర్తి పాటను బుధవారం విడుదల చేశారు. మద్యానికి బానిసైన ఓ యువకుడి కథతో తెరకెక్కిన 'మధురా వైన్స్' ట్రైలర్ కూడా రిలీజైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: