ETV Bharat / sitara

'హిట్'​ సీక్వెల్​లో హీరో అతడేనా..? - 'హిట్'​ సీక్వెల్​లో హీరో అతడేనా..?

వైవిధ్యభరిత క్రైం థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం 'హిట్‌'. విశ్వక్​ సేన్‌ హీరోగా నాని నిర్మించిన ఈ సినిమా.. మంచి ఆదరణను దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా 'హిట్‌ 2'ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. అయితే ఈ సీక్వెల్​లో విశ్వక్​ కాకుండా మరో హీరోతో సినిమా తీయనున్నట్లు సమాచారం.

Telugu HIT movie sequel with actor adivi sesh?
'హిట్'​ సీక్వెల్​లో హీరో అతడేనా..?
author img

By

Published : Nov 29, 2020, 8:38 PM IST

'హిట్‌'.. నిర్మాతగా నానికి, హీరోగా విశ్వక్‌ సేన్‌కి మంచి హిట్‌ అందించింది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌కి సీక్వెల్‌ రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే రెండో భాగంలో కథానాయకుడు మారబోతున్నట్లు సమాచారం. కొనసాగింపు చిత్రం కోసం అడివి శేష్​ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం.

సీక్వెల్‌ కూడా విశ్వక్‌తోనే చేద్దామనుకున్నా ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల శేష్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లకు కేరాఫ్‌ నిలుస్తాడని చాలా చిత్రాలతో నిరూపించుకున్నాడు శేష్‌. అందుకే ఆయనకే మరో 'హిట్‌' ఇవ్వనున్నారని వినికిడి. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అడివి శేష్‌ ప్రస్తుతం మహేష్‌బాబు నిర్మాణంలో 'మేజర్‌' చిత్రం చేస్తున్నారు. దీనితో పాటు 'గూఢచారి 2' చిత్రానికి పచ్చజెండా ఊపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.