తెలుగు యువహీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో విషాదం నెలకొంది. అతడి సోదరుడు రామాంజులు రెడ్డి.. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కడప జిల్లా చెన్నూరు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన సోదరుడు కన్నుమూయడం అతడికి పెద్ద కుదుపనే చెప్పాలి.

ఇవీ చదవండి: