ETV Bharat / sitara

హాలీవుడ్​ సినిమాలో తెలుగమ్మాయి - హాలీవుడ్​లో తెలుగునటి

పలు తెలుగుచిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగుమ్మాయి అవంతిక వందనపు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. డిస్నీ ఛానల్ నిర్మించిన స్పిన్ చిత్రంలో నటించింది.

avanthika
అవంతిక వందనపు, అవంతిక
author img

By

Published : Jun 26, 2021, 8:26 PM IST

బ్రహ్మోత్సవం, మనమంతా, ప్రేమమ్, అజ్ఞాతవాసి చిత్రాలతోపాటు ప్రజాహక్కు అనే లఘు చిత్రంలో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు. ప్రస్తుతం ఈమె హాలీవుడ్​ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. అవంతిక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం 'స్పిన్'. డిస్నీ ఛానల్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా స్పిన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

avanthika
హాలీవుడ్​ సినిమాలో అవంతిక
avanthika
హాలీవుడ్​ సినిమాలో నటించిన తెలుగు నటి

అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ కుటుంబంలో పుట్టిన రియా అనే అమ్మాయిగా అవంతిక ఆ చిత్రంలో నటించింది. సంగీతమంటే ఎంతో ఆరాధించే రియా.. డీజే మిక్సింగ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుందనేది స్పిన్ చిత్రంలో చూపించబోతున్నారు. హాలీవుడ్ లో తన తొలిచిత్రం విడుదలవుతుండటం పట్ల అవంతిక ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.

avanthika
స్పిన్ చిత్రంలో అవంతిక

ఇదీ చదవండి:MAA Election: ప్రకాశ్‌రాజ్‌పై విమర్శలకు ఆర్జీవీ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.