ETV Bharat / sitara

పెళ్లికి సిద్ధమై బ్రేకప్ చెప్పేసుకున్న సెలబ్రిటీలు వీరే! - త్రిష మ్యారేజ్ న్యూస్

మనసులు కలిశాయి. నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక మిగిలింది పెళ్లి మాత్రమే. సరిగ్గా ఇలాంటి టైమ్​లో ఏమైందో ఏమో గానీ అంతా తూచ్​ అని విడిపోయారు కొందరు సినీ సెలబ్రిటీలు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.

Telugu celebrity couples came closer to wedding but called off
మూవీ న్యూస్
author img

By

Published : Aug 31, 2021, 3:48 PM IST

Updated : Aug 31, 2021, 5:13 PM IST

తెరపై ప్రేమ కల్పితం! కానీ నిజజీవితంలో పలువురు హీరోహీరోయిన్లు, దానిని నిజం చేసి చూపించారు. మరికొందరు మాత్రం.. 'అంతా ఓకే, ఇక పెళ్లి మాత్రమే మిగిలుంది' అనే సమయానికి తమ బంధాన్ని తెగదెంపులుచేసేసుకున్నారు. కారణాలు ఏమైనప్పటికీ, వారి లవ్ మాత్రం​ బ్రేకప్​ అయిపోయింది. ఆ ఇద్దరికే కాకుండా వారి వారి అభిమానులకు కూడా వేదన మిగిల్చింది. ఇంతకీ అలాంటి జంటలు ఏవి? వారు విడిపోవడానికి కారణాలు ఏంటి?

1. ఉదయ్​కిరణ్-సుస్మిత

.
.

2000లో లవర్​బాయ్​ అంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు ఉదయ్​కిరణ్. చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత, ఉదయ్ ప్రేమించుకున్నట్లు.. 2003లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సినీవర్గాల్లో చర్చ సాగింది. కానీ ఏమైందో ఏమో వివాహం మాత్రం జరగలేదు. ఆ తర్వాత ఉదయ్, విషితను.. సుస్మిత, విష్ణు ప్రసాద్​ను పెళ్లిచేసుకున్నారు.

2.రష్మిక-రక్షిత్ శెట్టి

.
.

కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్​గా పరిచయమైన హీరోయిన్ రష్మిక.. అందులో హీరోగా నటించిన రక్షిత్​ శెట్టితో ఏడడుగుల బంధానికి సిద్ధమైంది. కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

3.మెహ్రీన్-భవ్య భిష్ణోయ్

.
.

తెలుగులో హీరోయిన్​గా వరుస సినిమాలు చేసిన మెహ్రీన్.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్​లాల్ మనవడు భవ్య భిష్ణోయ్​ను వివాహమాడాలని నిశ్చయించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత, తమ నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలా వీరి బంధానికి తెరపడింది.

4.అఖిల్-శ్రియ

.
.

అక్కినేని హీరో అఖిల్​కు కూడా యుక్త వయసులోనే పెళ్లి అయిపోవాల్సింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్​తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు.

5.తరుణ్-ఆర్తి అగర్వాల్

.
.

నువ్వులేక నేను లేను సినిమా తర్వాత టాలీవుడ్​లో మోస్ట్ రొమాంటిక్ కపుల్​గా తరుణ్-ఆర్తి అగర్వాల్ గుర్తింపు పొందారు. వీరిని జంటగా సినిమాల్లో చూస్తుంటే నిజమైన ప్రేమికుల్లానే కనిపించేవారు. అయితే వీరిద్దరూ గాఢంగా లవ్​ చేసుకున్నారని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

6.ప్రభుదేవా-నయనతార

.
.

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ మెప్పిస్తున్న నయనతార గతంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో కొన్నాళ్లు రిలేషన్​ కొనసాగించింది. అతడితో పెళ్లి కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడింది. కానీ అకస్మాత్తుగా వీరిద్దరూ తమ బంధానికి బ్రేకప్​ చెప్పేసుకున్నారు.

7.త్రిష-వరుణ్

.
.

ముద్దుగుమ్మ త్రిష కూడా గతంలో వరుణ్ అనే పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. కానీ అది వివాహ బంధం వరకు వెళ్లలేదు. ఏమైంది అనే కారణాలు కూడా ఏం వెల్లడించలేదు.

Last Updated : Aug 31, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.