జూ.ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండేళ్ల క్రితం వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయం ఆసక్తి నెలకొంది.
జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?
ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నటించేందుకు ఇప్పటికే జాన్వీ ఉత్సాహం చూపిస్తోంది. ఈ తరుణంలో అన్నీ అనుకున్నట్లు సాగితే, ఆమెను త్వరలో తెలుగు తెరపై చూడొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. కార్గిల్ యుద్ధ వనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తీస్తున్న 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది.
ఇదీ చదవండి: రాములోరి పండక్కి 'ఆచార్య' ఫస్ట్‌లుక్!