ETV Bharat / sitara

నవంబరు 14న టీఎఫ్​సీసీ ఎన్నికలు

ఫిల్మ్ ఛాంబర్​ ఆఫ్ కామర్స్ తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు నవంబరు 14న జరగనున్నాయి. ఇందులో ఎవరైనా సరే పోటీ చేయొచ్చని ప్రకటించారు.

telangana film producers council election 2021 on november 14th
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్
author img

By

Published : Oct 24, 2021, 6:27 AM IST

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 14న జరగనున్న ఈ ఎలక్షన్ కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడారు.

"ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక కమిటీ గడువు పూర్తి కానుండటం వల్ల నవంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో ఎవరైనా నామినేషన్‌ వేయవచ్చు. అదే రోజున 'తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' ఎన్నికలు జరగనున్నాయి. ఆసక్తిగల వారు ఎవరైనా పోటీ చేయవచ్చు" అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.

"టీఎఫ్‌సీసీ ప్రారంభమై ఏడేళ్లు పూర్తవుతోంది. ఇందులో 8వేల మంది సభ్యులుగా చేరడమన్నది సాధారణమైన విషయం కాదు" అని ఎ.గురురాజ్‌ అన్నారు. ‘టీమా’ జనరల్‌ సెక్రటరీ స్నిగ్ధ.. "ఇప్పటి వరకు 'టీమా'లో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఇకపైనా చేస్తాం. తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం" అని అన్నారు. "ఫిల్మ్‌ నగర్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయం వద్ద ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తాం" అన్నారు అడ్వకేట్‌, ఎన్నికల అధికారి కేవీఎల్‌ నరసింహారావు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.