ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతగా, రచయితగా మారి తెరకెక్కించిన '99 సాంగ్స్' సినిమా. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలై సినీప్రియులను ఆక్టటుకుంటోంది.
జియో స్టూడియోస్‌తో కలిసి రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు కాగా.. హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్ భట్, ఎడిల్సే వర్గాస్ పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రే కూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజస్'. నేడు ఈ భామ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించనుంది. ఆర్‌ఎస్‌వీపీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు.. రోనీ స్క్రూవాలా నిర్మాత. సర్వేశ్ మేవర దర్శకుడు.
నిహారిక కొణిదెల కథానాయికగా, విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్'. ఆరుముగ కుమార్ దర్శకుడు. 2018లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రాన్ని.. మూడేళ్ల తర్వాత 'ఓ మంచి రోజు చూసి చెప్తా' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల ప్రకటించారు. మార్చి 24న ఉదయం 9.30గంటలకు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
ఇదీ చూడండి: థియేటర్లో పవన్ 'వకీల్‌సాబ్' ట్రైలర్ రిలీజ్