కృష్ణా జిల్లా తారక్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ సోమవారం కన్నుమూశాడు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో జయదేవ్‌తో కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేశాడు.
"నాకు అత్యంత ఆప్తుడైన జయదేవ్ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. 'నిన్ను చూడాలని'’ చిత్రంతో మొదలైన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు.