ETV Bharat / sitara

'ఆ నమ్మకంతోనే 'మిషన్​ ఇంపాజిబుల్'​ రిలీజ్​ చేస్తున్నాం' - తాప్సీ మిషన్​ ఇంపాజిబుల్​ సినిమా

Tapsee Mission Impossible movie: నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్​ ఇంపాజిబుల్​'. ఏప్రిల్​ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు స్వరూప్​. ఆ సంగతులను తెలుసుకుందాం..

Tapsee Mission Impossible interview
Tapsee Mission Impossible interview
author img

By

Published : Mar 26, 2022, 8:36 PM IST

Tapsee Mission Impossible movie: 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు స్వరూప్‌ ఆర్‌.ఎస్. జె. ద్వితీయ ప్రయత్నంగా 'మిషన్‌ ఇంపాజిబుల్‌' అనే సినిమాను తెరకెక్కించారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను పట్టుకుంటే డబ్బులిస్తారనే ముగ్గురు చిన్నారుల ఆశ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా స్వరూప్‌ చిత్ర విశేషాలను తెలిపారు. ఆ సంగతులివీ..

అలా మొదలైంది: 'ఏజెంట్‌..' చిత్రానికంటే ముందు 2014లో.. ఓ వార్త నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటన ఆధారంగా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ కథను రాశా. ముందుగా.. ఈ సినిమాలోని కీలక పాత్రను మేల్‌ వెర్షన్‌లో అనుకున్నా. నా గత చిత్రంలోని ఓ పాత్రకు కాస్త దగ్గరగా ఉందనిపించడంతో ఫిమేల్‌ వెర్షన్‌గా మార్చా. ఈ క్యారెక్టర్‌కు న్యాయం చేయగలిగే నటి తాప్సీనే అని ఫిక్స్‌ అయి ఆమెను సంప్రదించా. ‘నా పాత్ర చిన్నదా పెద్దదా అని చూడట్లేదు. ఈ కథ నాకు బాగా నచ్చింది’ అని సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్‌శెట్టి అతిథిగా కనిపిస్తారు. మలయాళ నటుడు హరీశ్‌ పేరడి ఓ ముఖ్య పాత్ర పోషించారు.

అయాకత్వం మిస్‌ అవుతున్నాం: సినిమాల ప్రభావమో.. ఇంటర్నెట్‌ వల్లనో ఈ తరం పిల్లలంతా తెలివిగా మాట్లాడుతున్నారు. అమాయకత్వం అనేది కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఆ ఇన్నోసెన్స్‌నే చూపించాం. ఆడిషన్స్‌కు వచ్చినవారంతా 'నరికేస్తాం.. పొడిచేస్తాం' అని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్తుంటే భయమేసింది (నవ్వుతూ..). చివరకు రోషన్‌, భానుప్రకాశ్‌, జయ్‌తీర్థ అనే ముగ్గురు బాయ్స్‌ను ఎంపిక చేశాం. 60 రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించాం.

షూటింగ్‌ జ్ఞాపకాలు: హైదరాబాద్‌ పరిసరాల్లోని 8 గ్రామాల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఏ రోజు షూటింగ్‌ పూర్తైతే ఆరోజే తిరిగి హైదరాబాద్‌ రాకుండా ఆయా ఊళ్లలోనే ఉండిపోయేవాళ్లం. షూట్‌కు ప్యాకప్‌ చెప్పాక ముగ్గురు చిన్నారులతో నేనూ నా టీమ్‌ సరదాగా ముచ్చటించేవాళ్లం. ఆటపాటలతో ఎంజాయ్‌ చేశాం. దాని వల్ల వారిలో భయం పోయి సెట్స్‌లో ఫ్రీగా ఉండేవారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కథపై నమ్మకంతోనే: హాస్య ప్రధానంగా సాగే చిత్రమిది. కామెడీతోపాటు ఇతర అంశాలూ ఉన్నాయి. అవేంటో, టైటిల్‌లో Mission కాకుండా Mishan అని ఎందుకు పెట్టామో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. వేసవి సెలవుల ప్రారంభం, ఉగాది పురస్కరించుకుని ఏప్రిల్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కథ బాగుంటే ఎప్పుడైనా, ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతోనే ఓ వైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైనా, మరోవైపు ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ విడుదలకు సిద్ధంగా ఉన్నా అనుకున్న తేదీకే వస్తున్నాం. ఇక పోతే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు సీక్వెల్స్‌ (ఏజెంట్‌-2, ఏజెంట్‌ 3) తీయాలనుకుంటున్నా. అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. ‘మిషన్‌..’ విడుదలయ్యాక మరో సినిమా గురించి ఆలోచిస్తా.

ఇదీ చూడండి: పెళ్లి పీటలెక్కనున్న ఆది పినిశెట్టి.. ఆ నటితోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.