ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ రావడం తెలుగుజాతికి, గాయక కుటుంబానికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. సంకీర్తన గ్రూప్,ఎలివేట్స్ గ్రూప్ సంయుక్తంగా సింగర్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ ఎన్కేఎం హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన తనికెళ్లను నిర్వాహకులు సత్కరించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందన్నారు. బాలుతో మిథునం చిత్రం నిర్మించడం, దానికి మంచి పేరు తెచ్చిపెట్టడం సంతోషం కలిగించిందని తెలిపారు.
- ఇదీ చూడండి : గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం