కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. సంక్రాంతి కానుకగా విజయ్ నటించిన 'మాస్టర్', శింబు 'ఈశ్వరన్' విడుదలవబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
-
Just in - #TamilNadu govt becomes first in country to permit increase in the seating capacity of cinemas/theatres/multiplexes from the existing 50 to 100%! pic.twitter.com/jg3PD0RGCE
— Sreedhar Pillai (@sri50) January 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just in - #TamilNadu govt becomes first in country to permit increase in the seating capacity of cinemas/theatres/multiplexes from the existing 50 to 100%! pic.twitter.com/jg3PD0RGCE
— Sreedhar Pillai (@sri50) January 4, 2021Just in - #TamilNadu govt becomes first in country to permit increase in the seating capacity of cinemas/theatres/multiplexes from the existing 50 to 100%! pic.twitter.com/jg3PD0RGCE
— Sreedhar Pillai (@sri50) January 4, 2021
కరోనా లాక్డౌన్ ఆంక్షల నడుమ మూతపడిన థియేటర్లు ఇటీవలే తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 50 శాతం వీక్షకులతో థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సీటింగ్ కెపాసిటీని 50 నుంచి 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.