ETV Bharat / sitara

Vairamuthu: ఈ అవార్డు వద్దు.. తిరిగి ఇచ్చేస్తున్నా!

ప్రముఖ రచయిత వైరాముత్తు(vairamuthu)కు ప్రతిష్ఠాత్మక అవార్డు ఓఎన్​వీ కురుప్​(KURUP) ఇవ్వడం పలువురు మహిళా సెలబ్రిటీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి ఈ పురస్కారాన్ని ఎలా ఇస్తారంటూ సోషల్​మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన సదరు రచయిత ఆ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

Vairamuthu awards
వైరాముత్తు
author img

By

Published : May 30, 2021, 3:39 PM IST

ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ కురుప్‌ (KURUP) అవార్డును తాను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రముఖ రచయిత వైరాముత్తు(vairamuthu) ప్రకటించారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలు అందించిన ఓఎన్‌వీ కురుప్‌ పేరుపై ఆ రంగంలో విశిష్ట సేవలు అందిస్తోన్న రచయితలకు ప్రతిఏటా కేరళ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటిస్తోంది. ప్రముఖ పాటల రచయిత వైరాముత్తును ఇటీవలే ఈ అవార్డు వరించింది. దీంతో, ఒకానొక సమయంలో మీటూ(me too vairamuthu) ఆరోపణలు ఎదుర్కొన్న ఇలాంటి వ్యక్తికి ఎంతో విలువైన గౌరవాన్ని ఎలా అందించారు అంటూ పలువురు సినీ ప్రముఖులు, మహిళలు సోషల్‌మీడియా వేదికగా జ్యూరీని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో తన గురించి విమర్శలు తలెత్తడం వల్ల ఓఎన్‌వీ అవార్డు(ONV kurup)ను తాను వెనక్కి ఇచ్చేయదలచుకున్నట్లు వైరాముత్తు ప్రకటించారు. జ్యూరీ ఇబ్బందులు ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైరాముత్తు ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశారు. అలాగే ఓఎన్‌వీ అవార్డుతోపాటు వచ్చిన మూడు లక్షలను.. కరోనా నియంత్రణ కోసం పోరాటం చేస్తున్న కేరళ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరో రూ.2 లక్షలను కేరళ ప్రభుత్వానికి తన వంతు విరాళంగా ప్రకటించారు.

దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో మీటూ ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో ప్రముఖ గాయని చిన్మయితోపాటు సుమారు 17 మంది మహిళలు వైరాముత్తుపై ఆరోపణలు చేశారు. వైరాముత్తు తమను మానసికంగా.. లైంగికంగా ఇబ్బందులకు గురిచేశారని వాళ్లు అప్పట్లో సోషల్‌ మీడియా వేదికగా గళం విప్పారు.

ఇదీ చూడండి: 'అలాంటి మహిళల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.