ETV Bharat / sitara

అనుమతి లేని ప్రాంతంలో ఇద్దరు నటులు.. కేసు నమోదు

ఇద్దరు ప్రముఖ తమిళ నటులపై కేసు నమోదు చేశారు కొడైక్కెనాల్​కు చెందిన పోలీసులు. ఈ-పాస్​ లేకుండా పర్యటక ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు చెరో రూ.2000 జరిమానా వేసినట్లు స్పష్టం చేశారు.

epass tamilnadu
ఈ-పాస్​ లేకుండా వెళ్లినందుకు ఇద్దరు నటులపై కేసు
author img

By

Published : Jul 29, 2020, 11:52 AM IST

తమిళనాడు రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పక్కాగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. అయితే వాటిని ఉల్లంఘించిన తమిళ నటులు విమల్​, సూరీపై కేసు నమోదు చేశారు కొడైక్కెనాల్​కు చెందిన పోలీసులు. అనుమతి లేని ఓ అటవీ ప్రాంతంలో వీరిద్దరూ సంచరించారని.. ఈ-పాస్​ లేకుండా ప్రయాణించారని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేశారు.

విమల్, సూరీ కలిసి ప్రేమ్​రాజ్​ సరస్సు వద్ద తీసుకున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవడం వల్ల.. విచారణకు ఆదేశించారు పోలీసులు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా జులై 18న వీరిద్దరూ.. ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు విచారణలో తెలిసింది. ఫలితంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇద్దరికీ చెరో రూ.2000 జరిమానా విధించారు.

ఇద్దరిపై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాళ్లను సరస్సు వద్దకు తీసుకెళ్లిన ముగ్గురు సిబ్బందిని తొలిగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటక ప్రాంతానికి దాదాపు మూడు నెలలుగా ఎవరినీ అనుమతించట్లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.