మాస్ మహారాజ రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా కలిసి మరోసారి నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 'ఖతర్నాక్','కిక్', 'దేవుడు చేసిన మనుషులు', 'అమర్ అక్బర్ ఆంథోనీ' సినిమాలతో ఇప్పటికే వెండితెరపై నాలుగుసార్లు అలరించిన ఈ జోడీ.. మరోసారి తెరపై కనువిందు చేయనున్నారట! అయితే ఈసారి ఇలియానా ప్రధాన పాత్రలో నటించట్లేదని.. కేవలం కొద్ది నిమిషాలు తళుక్కుమంటుందని సమాచారం. రవితేజ నటిస్తున్న 'రామారావు' చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మాస్‌మహారాజ సరసన ఈ భామ ఆడిపాడనుందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నిజమైతే అటు మాస్‌మహారాజ ఫ్యాన్స్‌తో పాటు ఇలియానా అభిమానులకూ పండగే.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'రామారావు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్లుగా దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ అలరించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ బాణీలను సమకూరుస్తున్నారు.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ ప్రశ్న.. రామ్‌చరణ్ ఫన్నీ ఆన్సర్