బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ దంపతులకు ఆదివారం మగబిడ్డ జన్మించాడు. అయితే అంతకుముందే ఆ దంపతులకు తైమూర్ అలీ ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. అతడి గురించి ఓ ఆసక్తికర విషయం మీ కోసం..
ఒకవేళ మీ ఇంట్లో ఓ ఆయా పనిచేస్తే ఎంత జీతమిస్తారు? మహా అయితే రూ.5 వేలు లేదంటే రూ.10 వేలు. అంతకంటే వారికి ఎక్కువ ఇవ్వకపోవచ్చు. కానీ.. సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ కోసం పని చేస్తున్న ఆయాకు జీతం ఎంతో తెలుసా? నెలకు అక్షరాలా రూ.లక్షా 50 వేలు. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇదే నిజం.
ఇదే విషయమై అప్పట్లో కరీనా సంప్రదించగా, అది నిజమేనని తేల్చింది. అయితే ఈ జీతమే కాకుండా మిగిలిన ఖర్చులు మరో రూ.25 వేల వరకు ఆమెకు ఇస్తారని సమాచారం. ఈ విషయమై సోషల్ మీడియాలో అప్పట్లో పెద్దే చర్చే సాగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఆయా జీతం ఎక్కువ అంటూ ఛలోక్తులు(జోక్స్) వేశారు. మరి ఇప్పుడు ఈ రెండో కుమారుడి కోసం సైఫ్-కరీనా జోడీ ఇంకెంత చెల్లిస్తారో చూడాలి మరి.
ఇదీ చూడండి: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కరీనా కపూర్