బాలీవుడ్ బ్యూటీ తాప్సీకి ముంబయి అదానీ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ షాక్ ఇచ్చింది. ముంబయిలోని తన నివాసానికి సంబంధించిన విద్యుత్ వినియోగ బిల్లును అధికంగా విధించారని అసంతృప్తిని వ్యక్తం చేసింది తాప్సీ. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్కనెలలోనే రూ.36 వేల విద్యుత్ సుంకాన్ని విధించారు. సాధారణ రోజుల కన్నా మూడు రెట్లు అదనంగా బిల్లు రావడం వల్ల ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది తాప్సీ.
-
And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻♀️ pic.twitter.com/GeBQUSJaft
— taapsee pannu (@taapsee) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻♀️ pic.twitter.com/GeBQUSJaft
— taapsee pannu (@taapsee) June 28, 2020And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻♀️ pic.twitter.com/GeBQUSJaft
— taapsee pannu (@taapsee) June 28, 2020
"మూడు నెలల లాక్డౌన్లో ఎలాంటి కొత్త గృహోపకరణాలు నా అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకోలేదు, వాడనూలేదు. కానీ, చివరి నెలలో మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ.. మా నుంచి మీరు ఎలాంటి విద్యుత్‌కు బిల్లు వసూల్ చేస్తున్నారు".
- తాప్సీ, కథానాయిక
తాప్సీ నివాసంలో మూడు నెలలకు వచ్చిన విద్యుత్ బిల్లులలో ఒక్క జూన్‌లోనే రూ.36 వేలకు రసీదు పంపారు. మే నెలలో మాత్రం కేవలం రూ.3,850 బిల్లు వచ్చినట్లు ఉంది. తనకున్న మరో ఆపార్ట్‌మెంట్‌లో ఎవరూ ఉండకపోయినా రూ.8,640 విద్యుత్ వాడకపు బిల్లును విధించారని.. అందులో కేవలం వారం వారం శుభ్రపరచడానికే వెళ్తామని తెలిపింది తాప్సీ.
ఈ విద్యుత్ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్ ప్రముఖులు వీర్ దాస్, అమైరా దస్తూర్, తుషార్, షట్లర్ గుత్తా జ్వాలా ఉన్నారు.