ETV Bharat / sitara

Taapsee: గ్రహాంతర వాసుల కథలో తాప్సీ? - తాప్సి కొత్త సినిమాలు

'ఝుమ్మంది నాదం'తో తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్​లో తన హవా కొనసాగిస్తోంది. అయితే త్వరలో ఆమె ఏలియన్ నేపథ్య సినిమాలో నటించనుందని సమాచారం.

tapsee
తాప్సి
author img

By

Published : Jun 25, 2021, 7:30 AM IST

బాలీవుడ్‌లో జోరు చూపిస్తుంది తాప్సీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ఇటీవల ఆమె ఓ పాన్‌ ఇండియా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అది ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథని, దానికి 'ఏలియన్‌' అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. భరత్‌ నీలకంఠన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట.

tapsee pannu
తాప్సి

"గ్రహాంతర వాసుల నేపథ్యంగా సాగే సైన్స్‌ ఫిక్షన్‌ కథ ఇది. ఎక్కడా హాలీవుడ్‌ ఏలియన్‌ సినిమాల ఛాయలు ఇందులో కనిపించవు. కొత్తగా ఉంటుంది. భారతదేశంలో ఏలియన్స్‌ ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రం ఉండనుంది"అని బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ భాషల్లో ఇది తెరకెక్కనుంది. తాప్సీ త్వరలోనే 'శెభాష్‌ మిథు' చిత్రీకరణలో పాల్గొననుంది. ఆమె నటించిన ‘'హాసిన్‌ దిల్‌రూబా' జులైలో ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా 'రష్మీ రాకెట్‌'’, 'లూప్‌ లపేటా' తదితర చిత్రాలు తాప్సీ చేతిలో ఉన్నాయి.

ఇదీ చదవండి : Kangana: నేను తప్ప మరెవ్వరూ డైరెక్ట్​ చేయలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.