ETV Bharat / sitara

'జిమ్​లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని' - 45 అంతస్తులపై తాప్సీ కసరత్తులు

'రష్మీ రాకెట్​' చిత్రం కోసం తానెంతో కష్టపడినట్లు వెల్లడించింది స్టార్​ హీరోయిన్​ తాప్సీ. లాక్​డౌన్​ సమయంలో జిమ్​లు లేకపోవడం వల్ల ఇంటివద్దే కసరత్తులు చేస్తూ.. 45 అంతస్తుల భవనాన్ని ఎక్కిదిగిన సందర్భాలున్నాయని తెలిపింది.

Taapsee Pannu climed the 45 floors of her building to prepare for Rashmi Rocket
'జిమ్​లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని'
author img

By

Published : Dec 20, 2020, 6:57 AM IST

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్​ తాప్సీ. ప్రస్తుతం ఆమె 'రష్మీ రాకెట్‌' అనే స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం కోసం సిద్ధమవుతోంది. దీన్ని ఆకర్ష్‌ ఖురానా తెరకెక్కిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఓ అథ్లెట్‌ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మలుచుకొనేందుకు గంటల తరబడి చెమటోడుస్తోంది.

Taapsee Pannu climed the 45 floors of her building to prepare for Rashmi Rocket
తాప్సీ

"రెండున్నర నెలల పాటు రష్మీ పాత్ర కోసం సన్నద్ధమయ్యాను. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాయామశాలలు మూసివేయడం వల్ల పెద్ద దెబ్బే తగిలింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొనేందుకు ఇంటివద్దే విస్తృతమైన కసరత్తులు చేశాను. రోజూ మా ఇంటి ఆవరణలో 2 కి.మీ.మేర పరుగెట్టేదాన్ని. 45 అంతస్తుల మా అపార్ట్‌మెంట్‌ భవనాన్ని ఎక్కి దిగిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి" అని శరీరాకృతి కోసం తను పడ్డ శ్రమ గురించి చెప్పింది తాప్సీ.

ఇదీ చూడండి: నజ్రియా.. నీ నవ్వుతో చేశావ్ మాయ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.