కథానాయిక తాప్సీ టీ స్పెషలిస్ట్‌గా మారిందా.. అనే సందేహంలో ఉన్నారా? అది నిజంగా కాదులెండి. నటనలో భాగంగా ఓ మంచి టీ సిద్ధం చేసింది తాప్సీ. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 'తప్పడ్' అనే చిత్రంలో నటించిందీ భామ. ఇందులో అమృత అనే గృహిణి పాత్ర పోషించింది. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో గులాబి రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది తాప్సీ. ఫ్లాస్క్, గ్లాస్, పంచదార గిన్నె ఉన్న ఓ ట్రే పట్టుకుని గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఒక్క పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో పాటు 'తప్పడ్' రెండో ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి సినిమాపై ఆసక్తి పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్-1 అంచనాలు పెంచుతుంది. భార్యాభర్తల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

'రష్మి రాకెట్' అనే మరో సినిమాలోనూ తాప్సీ నటిస్తోంది. ఇందులో ఆమె గుజరాత్‌కు చెందిన ఫాస్ట్ రన్నర్ రష్మి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: రమ్యకృష్ణ 'కేజీఎఫ్ 2'ను తిరస్కరించిందా..!