మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"చరిత్ర స్మరించుకుంటుంది... ఝాన్సీ లక్ష్మీ భాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని.. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరగయ్యాడు ఒక వీరుడు".. అంటూ సాగే డైలాగ్‌తో ప్రారంభమైంది టీజర్. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ టీజర్లో విజువల్స్ బాగున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సైరా'లో భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, మెగా డాటర్ నిహారిక తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాత. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చూడండి.. అనుపమకు ఏమైంది.. ఎవరిని మిస్ అవుతుంది?