Sushmithasen Breakup: ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్‌తో ప్రేమబంధానికి మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవలే స్వస్తి చెప్పింది. ఎన్నో ఏళ్ల నుంచి సహజీవనంలో ఉన్న ఈ జంట ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకోవడం వల్ల బీటౌన్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణమేమై ఉంటుందా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మితా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఇందులో భాగంగా తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు.
ఓ నెటిజన్.. "మేడమ్.. మీ ఉద్దేశం ప్రకారం గౌరవం అంటే ఏమిటి?" అని ప్రశ్నించగా.. "గౌరవానికి నేను జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రేమ కంటే గౌరవమే ఎక్కువ. గౌరవం లేనిచోట ప్రేమకు స్థానం లేదు. ప్రేమ వస్తుంది.. పోతుంది. గౌరవం అనేది ఉంటే ప్రేమ చిగురించడానికి రెండో అవకాశం ఉన్నట్లే" అని ఆమె చెప్పుకొచ్చారు.
అనంతరం తాను ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే వెంటనే స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల నిజ జీవిత కథలు వింటుంటానని.. అలా ప్రేరణ పొంది మళ్లీ సాధారణ జీవితంలోకి రాగలుగుతానని అన్నారు. దీంతో, రోహ్మాన్ షాల్ గౌరవం ఇవ్వకపోవడం వల్లే సుస్మిత.. ఆయనకు బ్రేకప్ చెప్పిందా? అని నెటిజన్లు చెప్పుకొంటున్నారు.
ఇక, సుస్మిత వ్యక్తిగత విషయానికి వస్తే.. తన కంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మాన్ షాల్‌తో ప్రేమలో పడింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఈ జంట.. డేటింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌లో సుస్మితాసేన్.. "మేమిద్దరం స్నేహితులుగా కలిశాం. ఇకపై మిత్రులుగానే ఉంటాం. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ముగిసిపోయింది. కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది" అని ప్రేమకు స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చూడండి: 'మా బంధం ముగిసింది'.. బ్రేకప్‌పై మాజీ విశ్వసుందరి క్లారిటీ