మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత అభిమానుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. బాల్కనీలో ఒంటరిగా ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని చెప్పింది.
"నేను సహన ప్రేమకు ఎప్పుడూ విధేయురాలినే. ఈ ఒంటరితనం.. నా అభిమానులకు అభిమానిగా మార్చింది. పదేళ్ల నుంచి నన్ను నటన వైపు నడిపించడానికి వారి అభిమానంతో ప్రోత్సహకం అందిస్తూ వచ్చిన ఫ్యాన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా" -సుస్మితా సేన్, నటి
2010లో అనీశ్ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన 'నో ప్రాబ్లమ్' సినిమాలో సుస్మితా చివరగా నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఈ విషయం గురించి అడిగిన ప్రతిసారీ.. వ్యక్తిగత కారణాల వల్లే సినిమాలకు విరామం ఇచ్చానంటూ ఆమె చెప్పేది.
అయితే ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుస్మితాసేన్.. ఈ విరామం గురించి మాట్లిడింది. వ్యక్తిగత కారణాలతోనే నటనకు విరామమిచ్చానని, తన రెండో దత్త కుమార్తె అలిసా కోసమే సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నానని చెప్పింది. అలిసా బాల్యానికి తాను దూరంగా ఉండాలనుకోలేదని, మొదటి దత్త కూతురు రేనీ విషయంలో తన బాల్య స్మృతులను కోల్పోయానంది. అలిసా విషయంలో ఆ తప్పు చేయాలనుకోవట్లేదని, ఇందుకోసమే నటనకు దూరంగా ఉన్ననంది.
ఇది చదవండి: తల్లిగా తనదైన ముద్ర వేసిన 'షకలక బేబి' సుస్మితాసేన్