బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ చివరి సినిమా 'దిల్ బెచారా'.. అభిమానుల నుంచి విశేషాదరణ పొందుతోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే, ఎవరికీ సాధ్యం కాని విధంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఐఎమ్‌డీబీలో 9.8/10 రేటింగ్‌ను దక్కించుకున్న తొలి సినిమాగా ఘనత సాధించింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైన తొలి వారంలోనే ఎక్కువమంది చూసిన చిత్రంగా 'దిల్ బెచారా' నిలిచింది.
టాప్ సినిమాలు
టీవీ టీఆర్పీను లెక్కించే బార్క్ నివేదిక ప్రకారం.. 'దిల్ బెచారా' ఓటీటీలో ఎక్కువమంది చూసిన చిత్రాల జాబితాలో తొలిస్థానంలో ఉంది. ఇటీవలే వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖుదా హఫీజ్' తర్వాతి స్థానం దక్కించుకుంది.
టాప్ వెబ్‌సిరీస్‌లు
జులై 1 నుంచి ఆగస్టు 20 వరకు ప్రధాన ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదల చేసిన హిందీ చిత్రాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. వెబ్‌సిరీస్‌ల్లో 'మస్త్ రామ్' అగ్రస్థానంలో.. ఆ తర్వాత 'బండిష్ బండిట్స్', 'డేంజరస్', 'ఆర్య' ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడం వల్ల స్మార్ట్ఫోన్ల వినియోగంతో పాటు సినిమాల వీక్షణ కూడా కొంతమేర తగ్గిందని బార్క్ నివేదిక పేర్కొంది.