ETV Bharat / sitara

చనిపోయే మూడు రోజుల ముందే స్టాఫ్​కు సుశాంత్ జీతాలు! - అమ్మకోసం సుశాంత్ లేఖ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఇందులో సుశాంత్​కు సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్​ చనిపోయే మూడు రోజుల ముందే తన స్టాఫ్​కు జీతాలు చెల్లించాడని, కొద్దిరోజుల తర్వాత జీతాలు ఇవ్వడం తనకు కుదరదని అన్నట్లు తెలుస్తోంది.

Sushant Singh Rajput's ashes to be immersed in Patna today
సుశాంత్
author img

By

Published : Jun 19, 2020, 12:03 PM IST

Updated : Jun 19, 2020, 12:34 PM IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్‌ స్టాఫ్‌, స్నేహితులు, కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మూడురోజుల ముందు సుశాంత్‌ తన స్టాఫ్‌కు జీతాలు చెల్లించాడని, కొద్దిరోజుల తర్వాత జీతాలు ఇవ్వడం తనకు కుదరదని ఆయన అన్నాడని కొంతమంది పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ వెబ్‌సిరీస్‌లో నటించమని కోరుతూ ఇటీవల సుశాంత్‌ తన మాజీ మేనేజర్‌ దిశాతో చర్చలు జరిపాడని హీరో ప్రస్తుత మేనేజర్‌ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు సుశాంత్‌ ఫోన్‌ పరిశీలించగా.. ఆయన మార్చి నెలలో చివరిసారిగా దిశాతో వాట్సాప్‌ చాట్‌ చేసినట్లు తెలిసింది.

'అమ్మకోసం' లేఖ రాసిన సుశాంత్‌

తన తల్లి మృతి అనంతరం ఒకానొక సమయంలో సుశాంత్‌ ఓ భావోద్వేగభరితమైన లేఖను రాశాడు. 2016లో రాసిన ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. "అమ్మా.. నీకు గుర్తుందా?నువ్వెప్పటికీ నాతోనే ఉంటానని మాటిచ్చావు, అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు, మనిద్దరం తప్పని తెలుస్తోంది" అని సుశాంత్‌ లేఖలో పేర్కొన్నాడు.

Sushant Singh Rajput's ashes to be immersed in Patna today
సుశాంత్ లేఖ

కన్నీళ్లు పెట్టిస్తోన్న అభిమాని వీడియో

సుశాంత్‌ సింగ్‌ బలవన్మరణంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో సుశాంత్‌కు సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. ఇప్పటివరకూ సుశాంత్‌ పోషించిన పాత్రలతో ఈ వీడియో రూపొందింది.

గంగానదిలో సుశాంత్‌ అస్థికలు

సుశాంత్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు గంగానదిలో కలిపారు. సుశాంత్‌ తండ్రి, సోదరితో పాటు, దగ్గరి బంధువులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Last Updated : Jun 19, 2020, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.