బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. సుశాంత్ మృతిని తట్టుకోలేక.. అతడి మరదలు సుధాదేవి మరణించారు. సుశాంత్ అంత్యక్రియల సమయంలో బిహార్‌లోని పూర్నియాలో ఆమె తుదిశ్వాస విడిచారు.
సుధాదేవి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అకస్మాత్తుగా సుశాంత్ మరణ వార్త విన్న ఆమె.. షాక్‌లోకి వెళ్లి శారీరకంగా, మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించారు. బాధతో తినడం కూడా మానేశారు. దీంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.
ముంబయి విల్లే పార్లేలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో సహా 20 మందిని మాత్రమే అనుమతించారు పోలీసులు.