ETV Bharat / sitara

సుశాంత్​ సింగ్ డ్రీమ్​ ప్రాజెక్ట్​.. త్వరలోనే సెట్స్​పైకి

సుశాంత్​ సింగ్​ డ్రీమ్​ ప్రాజెక్ట్​ను తీసి, అతడికి అంకితమిస్తానని దర్శకుడు సంజయ్​ తెలిపారు​. అయితే చిత్రీకరణ ప్రారంభంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

sushanth
సుశాంత్​
author img

By

Published : Jan 9, 2021, 9:40 PM IST

బాలీవుడ్​ యంగ్​ హీరో సుశాంత్​ సింగ్​ డ్రీమ్​ ప్రాజెక్ట్.. ​అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కాల్సిన సినిమా 'చందమామ దూర్​ కి' త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు, దర్శకుడు సంజయ్​ పూరన్​ సింగ్​ స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించి సుశాంత్​కు అంకితమిస్తానని చెప్పారు.

సుశాంత్​ సింగ్ హీరోగా 'చందమామ దూర్​ కి' సినిమాను తీస్తున్నట్లు 2017లో ప్రకటించారు. అందుకోసం సదరు నటుడు నాసాలో శిక్షణ కూడా తీసుకున్నారు. పాత్రలో ఒదిగిపోవడం కోసం వ్యోమగాముల​తో కలిసి చర్చించేవాడు. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల తొలి దశలోనే ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే సంజయ్​ సింగ్​ రూపొందిస్తానని వెల్లడించారు.

సుశాంత్​ సింగ్​కు ఉన్న లక్ష్యాల్లో​ వ్యోమగామి కావడం ఒకటి. ఈ విషయాన్ని తాను మరణిించడానికి కొన్ని రోజుల ముందు.. 'తను జీవితంలో సాధించాల్సిన 50 కలల జాబితా' అంటూ ఓ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. గతంలో జరిగిన ఇంటర్వ్యూల్లో, చాలా సందర్భాల్లో తనకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలంటే చాలా ఆసక్తి అని కూడా చెప్పేవారు సుశాంత్.

ఇదీ చూడండి : ఈ ఏడాది టాప్ సెర్చ్​డ్ సెలబ్రిటీస్​గా సుశాంత్, రియా​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.