ETV Bharat / sitara

ఆత్మహత్య ముందు రోజు సుశాంత్​ ఒంటరిగా ఉన్నాడా?

author img

By

Published : Sep 17, 2020, 11:27 AM IST

సుశాంత్ రాజ్​పుత్​ మరణానికి ముందు రోజంతా తన గదిలో ఒంటరిగా గడిపాడని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో తేలినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. హీరో చరవాణిలో కార్యకలాపాలు చూసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

Sushant Singh Rajput went off-grid day before his demise?
'మరణానికి ముందు రోజు సుశాంత్​ ఒంటరిగా ఉన్నాడా?'

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజంతా ఒంటరిగా గడిపాడని సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఓ మీడియా నివేదిక ప్రకారం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా సుశాంత్​ మరణానికి ముందు రోజు అతడి చరవాణి చేసిన కార్యకలాపాల గురించి వివరాలు సేకరించారు. దీని ద్వారా చనిపోయే ముందు రోజు మాత్రమే అతడు ఒంటరిగా గడిపాడని తెలుసుకున్నారు.

సుశాంత్​ కాల్​కు స్పందించలేదు

సుశాంత్​ మృతి చెందిన ముందు రోజు గదిలో ఒంటరిగా ఉన్నాడని.. ఎవ్వరితోనూ మాట్లాడలేదని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందురోజు తన ప్రేయసి రియా చక్రవర్తికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:47 గంటలకు సుశాంత్​ ఫోన్​ చేసినట్లు నివేదిక పేర్కొంది. 1:51 గంటలకు స్నేహితుడైన మహేశ్​ శెట్టికి కాల్​ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ సుశాంత్​ ఫోన్​కాల్​కు​ స్పందించలేదు.

ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రస్తుతం తుది దర్యాప్తు చేస్తుందని.. అందులో ఎలాంటి గందరగోళం లేకుండా పక్కా సమాచారం సేకరిస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు. సెప్టెంబరు 17న వైద్య బృందంతో సమావేశానికి ముందు ఈ కేసులో హత్య జరిగే పరిణామాలను అంచనా వేసే అవకాశం ఉంది.

సుశాంత్​ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆభియోగాలు ఎదుర్కొంటున్న హీరో ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్​ చక్రవర్తి ఇప్పటికే అరెస్టు అయ్యారు. సుశాంత్​ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో పాట నార్కోటిక్క్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)లు దర్యాప్తు చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.