ETV Bharat / sitara

'ఆమెను సుశాంత్​ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు' - bollywood nepotism latest news

వచ్చే ఏడాది ప్రారంభంలో సుశాంత్ పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అతడి తండ్రి కేకే సింగ్ చెప్పారు. తమతో అతడు జరిపిన చివరి సంభాషణ ఇదేనని గుర్తు చేసుకున్నారు.

Sushant Singh Rajput
సుశాంత్​ సింగ్​
author img

By

Published : Jun 26, 2020, 11:46 AM IST

Updated : Jun 26, 2020, 12:21 PM IST

యువ కథానాయకుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య.. బాలీవుడ్​ మొత్తాన్ని ఓ కుదుపు కుదిపేసింది. జ్ఞాపకాల నుంచి ఇతడి కుటుంబం ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. అయితే, సుశాంత్​ వివాహంపై స్పందించిన ఈ నటుడు తండ్రి కేకే సింగ్​... నటి రియా చక్రవర్తిని వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిపారు.

"మేం గతంలోనే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. కరోనా సమయంలో తాను వివాహం చేసుకోనని సుశాంత్ చెప్పాడు. తాను నటించిన సినిమా విడుదలైన తర్వాత.. వచ్చే ఫిబ్రవరి-మార్చిలో వివాహం చేసుకోవాలనుకున్నాడు. అతని పెళ్లి గురించి మేం జరిపిన చివరి సంభాషణ ఇదే"

కేకే సింగ్​, సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ తండ్రి

వివాహం విషయంలో సుశాంత్​ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. నచ్చిన అమ్మాయిని చేసుకోమని అతడికి చెప్పినట్లు కేకే సింగ్ చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. సుశాంత్​ చిన్నతనంలో చలాకీగా ఉండేవాడని, ఈ మధ్య కాలంలో ఎందుకో ఒంటరితనం అలవాటు చేసుకున్నాడని వెల్లడించారు.

జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు, అతడి ఇంట్లో దొరికిన వైద్యపరీక్ష పత్రాల ద్వారా తేలింది. అయితే బాలీవుడ్​లో​ నెపోటిజమ్ వల్ల అతడికి అవకాశాలు తగ్గిపోయాయని పలువురు సినీ ప్రముఖులు ఆరోపించారు. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి:నితిన్​కు మూడు గెటప్పులు.. హాలీవుడ్ నిపుణులు

Last Updated : Jun 26, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.