కాలేజీ జీవితం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభవం. ఎంతో అల్లరి చేసుంటారు. ఎన్నో జ్ఞాపకాల్ని దాచుకుని ఉంటారు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాటిని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసిన బాలీవుడ్ చిత్రం 'చిచోరే'. ట్రైలర్ హాస్య భరితంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటించాడు. 'సాహో' భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించింది. వరుణ్ శర్మ, తాహిర్ రాజ్, నవీన్ పోలిశెట్టి తదితరులు సహాయ పాత్రలు పోషించారు. 'దంగల్' దర్శకుడు నితీశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సాజిద్ నడియావాలా నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: సాహో పాట: 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే'