బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడితో సంబంధమున్న వ్యక్తుల్ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్చర్యపరిచే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా అలాంటిదే సుశాంత్ సైకియాట్రిస్ట్ కేసరి చవుడా చెప్పారు. ప్రేయసి అంకితా లోఖండేతో బ్రేకప్ అయినందుకు సుశాంత్ చాలా పశ్చాత్తాపడేవాడని వెల్లడించారు. ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రవర్తన మాత్రం అతడికి నచ్చేది కాదని తెలిపారు.
సుశాంత్.. కెరీర్ ప్రారంభంలో 'పవిత్రరిస్తా' సీరియల్ చేసినప్పుడు అంకితాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్లో ఉన్న వీరిద్దరూ.. 2016లో విడిపోయారు. ఆ తర్వాత కృతి సనన్‌తో డేటింగ్లో ఉన్నాసరే ఈ నటుడు బహిరంగంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు రియా చక్రవర్తితో రిలేషన్షిప్ కొనసాగించాడు.
ఈ ఆదివారం(జూన్ 14).. బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్. మానసిక ఒత్తిడి కారణంగానే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి మృతికి బాలీవుడ్‌లోని నెపోటిజమ్ మరో కారణమని పలువురు సెలబ్రిటీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. అందరిని విచారిస్తున్నారు. సుశాంత్ వంటమనిషి, మేనేజర్లు, రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేశ్ చబ్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇవీ చదవండి: