ETV Bharat / sitara

సుశాంత్​ ట్విట్టర్​ కవర్​పేజీకి అర్థం అదేనా?

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణం సినీలోకంతో పాటు, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అతను చనిపోవడానికి కారణం మానసిక ఒత్తిడేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, సుశాంత్​ ట్విట్టర్​ కవర్ పేజీ చూస్తే అతని మానసిక పరిస్థితి ఏంటనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే, అదొక డిప్రెషన్​ సింబల్​.

Sushant Singh Rajput has posted a photo of the Depression, a photo of him as a Twitter wallpaper.
సుశాంత్​ సింగ్​
author img

By

Published : Jun 18, 2020, 10:28 AM IST

నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. విభిన్న పాత్రలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్. తన నటనతో అందర్నీ మెప్పించిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాడు‌. మానసిక ఒత్తిడి కారణంగా ఈ హీరో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇండస్ట్రీకి సంబంధించిన వేడుకల్లో కానీ, బయట మరెక్కడైనా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవాడు సుశాంత్​. ఆత్మహత్య చేసుకునేంతటి తీవ్ర మానసిక ఒత్తిడితో అతడు పోరాడుతున్నాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ సుశాంత్‌ సింగ్‌ ట్విట్టర్​‌ కవర్‌ పేజీ చూస్తే అతడి మానసిక స్థితి ఎవరికైనా అర్థమౌతుంది. ఎందుకంటే ఈ హీరో కవర్‌ పేజీలో ఉన్న పెయింటింగ్‌ డిప్రెషన్‌కి సింబల్‌.

Sushant Singh Rajput has posted a photo of the Depression, a photo of him as a Twitter wallpaper.
సుశాంత్​ ట్విట్టర్​

'స్టార్రి నైట్' అంటే..

ప్రముఖ డచ్‌ పెయింటర్‌ విన్సెంట్ వాన్ గోహ్ వేసిన పెయింటింగ్స్‌లో 'స్టార్రినైట్‌'కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పెయింటింగ్‌ వేసే సమయంలో ఆయన తూర్పు ఫ్రాన్స్‌లో ఉన్న సెయింట్-పాల్-డి-మౌసోల్ అనే మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రతిరోజూ తన గదిలోని కిటికీ నుంచి బయట ఉన్న గ్రామాన్ని చూస్తూ ఆయన ఈ పెయింటింగ్‌ను వేసినట్లు చాలా మంది చెప్పుకున్నారు. పెయింటింగ్‌లో గల డార్క్‌లైన్స్‌ ఆయనలోని ఆత్మహత్య ఆలోచనలకు గుర్తు అని అందరూ చెబుతుంటారు. పేదరికం, మానసిక అనారోగ్యం, కుంగుబాటుతో ఎన్నో సంవత్సరాలపాటు పోరాటం చేసి జులై 29, 1890లో ఆయన బలవన్మరణం చెందారు. గోహ్​ మృతి తర్వాత 'స్టార్రినైట్‌' పెయింటింగ్‌ మానసిక కుంగుబాటుకు ఓ గుర్తుగా భావించడం ప్రారంభించారు. అలాంటి పెయింటింగ్‌ను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తన ట్విట్టర్‌ ఖాతా కవర్‌ పేజీగా పెట్టుకున్నారు.

వాన్ గోహ్
Sushant Singh Rajput has posted a photo of the Depression, a photo of him as a Twitter wallpaper.
సుశాంత్​ సింగ్​

ఒక్కరాత్రిలో పెరిగిన ఫాలోవర్స్‌

సుశాంత్‌ సింగ్ మరణం తర్వాత ఇన్‌స్టాలో అతడిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సుశాంత్‌ మృతికి ముందు రోజు వరకూ 9 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 11.5 మిలియన్లకు చేరింది. ఇప్పటివరకూ ఈ హీరో చేసిన పోస్టులకు వరుస లైకులు చేస్తున్నారు.

సుశాంత్‌ ఆలోచనలతో వెబ్‌సైట్‌

సుశాంత్‌ మృతి అనంతరం ఆయన బృందం ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. Selfmusing.com పేరుతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ వేదికగా సుశాంత్‌ ఆలోచనలు, అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకోనున్నారు. "భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన మన ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటారు. మీలాంటి అభిమానులందరూ ఆయనకి గాడ్‌ ఫాదర్‌తో సమానం. సుశాంత్‌కిచ్చిన మాట ప్రకారం ఇక నుంచి ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, కలలు, ఆశయాలను షేర్‌ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తాం. ఆయన వదిలివెళ్లిన అన్ని సానుకూల ఆలోచనలను ఇందులో పొందుపరచనున్నాం." అని సదరు టీమ్ పేర్కొంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.