ETV Bharat / sitara

'ఆరోపణలు నిజం కాకపోతే పద్మ శ్రీ తిరిగిచ్చేస్తా'

ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తానని తెలిపింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్​. యువ హీరో సుశాంత్​ బలవన్మరణం వెనుక చాలా మంది పాత్ర ఉందని ఆమె ఆరోపించింది. వాటిని నిరూపించలేకపోతే ఈ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని వెల్లడించింది.

kangana
ఆరోపణలు నిరూపించలేకపోతే పద్మశ్రీ తిరిగిచ్చెస్తా: కంగనా
author img

By

Published : Jul 18, 2020, 2:45 PM IST

బాలీవుడ్​లో ఎలాంటి విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడే లేడీ డాన్, నటి కంగనా రనౌత్ కీలక ప్రకటన చేసింది. యువహీరో సుశాంత్​ మరణం వెనుక చాలా మంది బంధుప్రీతి కుట్రలున్నాయని ఆరోపించింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై ముంబయి పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని.. వాటిని నిరూపించుకోలేని పక్షంలో పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని వెల్లడించింది.

పారిపోలేదు...!

సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబయి పోలీసులు తాను మనాలీలో ఉండగా ఫోన్​ చేశారని.. రిపోర్టు తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా పంపలేదని ఆరోపించింది. తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడతానని.. పారిపోయే వ్యక్తిని కానని స్పష్టం చేసింది.

జూన్​ 14న సుశాంత్​ ఆత్మహత్య యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హిందీ చిత్రసీమలో నెపోటిజంపై విమర్శలు వచ్చాయి. వాటిల్లో మహేశ్​ భట్​, కరణ్​​ జోహర్​ వంటి నిర్మాతల పాత్ర ఉందని పరోక్షంగా ఘాటు విమర్శలు చేసింది కంగన. ఆత్మహత్యా? లేదంటే ప్రణాళిక ప్రకారం చేసిన హత్యా? అనేది తేల్చాలని ఆమె కోరింది. ఇది సోషల్​మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.