బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు విచారణ నిమిత్తం అతని మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీ మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యింది. రాజ్పుత్ స్నేహితుడు సిద్దార్థ్ పిథాని కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఉదయం 9.30 గంటలకు మోదీ రాగా.. మధ్యాహ్నం సుశాంత్ సోదరి మితూ సింగ్ హాజరైంది. ఇప్పటికే సుశాంత్ కేసు విచారణలో భాగంగా సోమవారం నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. శ్రుతిని కూడా విచారించారు.
రియా కుటుంబ సభ్యులతో పాటు కేసుతో సంబంధమున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక పట్నాలో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈరోజు(మంగళవారం) విచారించనుంది.