ETV Bharat / sitara

సల్మాన్​, కరణ్​ జోహార్​కు బిహార్ కోర్టు ఆదేశం - సుశాంత్​ సూసైడ్

సుశాంత్​ సింగ్​ మృతి కేసులో జనవరి తొలి వారంలోగా వాదనలను వినిపించాలని బిహార్ కోర్టు సల్మాన్, కరణ్​ జోహార్​లను ఆదేశించింది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ తరఫు న్యాయవాదాలు వారి వాదనలు వినిపించారు.

salman
సల్మాన్​
author img

By

Published : Dec 19, 2020, 8:39 PM IST

సల్మాన్​, కరణ్​ కోర్టు ముందు హాజరు కావాలి

నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో​ బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​, నిర్మాత కరణ్​ జోహార్​.. త్వరగా తమ వాదనలను వినిపించాలని బిహార్​​ ముజఫర్​పుర్ కోర్టు ఆదేశించింది​. రానున్న జనవరి తొలి వారంలోగా ఈ ప్రక్రియ జరగాలని ఆదేశించింది. ​

సుశాంత్​ ఆత్మహత్య చేసుకోవడం వెనుక బాలీవుడ్​ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిహార్‌లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్.. కొంతకాలం క్రితం ముజఫర్​పుర్​ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద సల్మాన్​, కరణ్​ జోహార్​, సంజయ్​ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, ఏక్తా కపూర్ సహ మరి కొంతమందిపై​ కేసు నమోదు చేశారు. సుశాంత్​ ఆత్మహత్యకు పాల్పడేలా వీరంతా పురికొల్పారని ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు.. వరుసగా వీరందరీ వాదనలు వినడం ప్రారంభించింది. సంజయ్​ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్​, భూషణ్ కుమార్​, సాజిద్​ నడియావాలా, దినేశ్​ విజయన్​ తరఫు న్యాయవాదులు కోర్టు ముందు వారి వాదనలను బుధవారం వినిపించారు. కానీ సల్మాన్​, కరణ్​​ న్యాయవాదులు మాత్రం హాజరు కాలేదు. దీంతో సల్మాన్​, కరణ్​ త్వరితగతిన తమ వాదనలు వినిపించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.