ETV Bharat / sitara

'అవును.. సుశాంత్​, సారా​ ప్రేమలో పడ్డారు!' - కంగనా రనౌత్​

దివంగత నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ గురించి అతని స్నేహితుడు శామ్యూల్​ కొన్ని ఆశ్చర్యకర విషయాలు పంచుకున్నాడు. 'కేదార్​నాథ్​' చిత్రీకరణలో నటి సారా అలీఖాన్​తో సుశాంత్ ప్రేమలో పడ్డాడని.. 'సోంచిరియా' చిత్రం విడుదలైన తర్వాత వారిద్దరూ విడిపోయారని వెల్లడించాడు. దీని వెనుక బాలీవుడ్​ మాఫియా పాత్ర బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

Sushant, Sara 'were totally in love', claims late actor's friend
'అవును.. సుశాంత్​, సారా అలీఖాన్​ ప్రేమలో పడ్డారు!'
author img

By

Published : Aug 20, 2020, 2:33 PM IST

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ గురించి అతని స్నేహితుడు శామ్యూల్​ హౌకిప్​ కొన్ని ఆశ్చర్యకర విషయాలు పంచుకున్నాడు. 'కేదార్​నాథ్​' చిత్రీకరణలో సుశాంత్​, సారా అలీఖాన్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారని శామ్యూల్​ సోషల్​మీడియాలో వెల్లడించాడు. సుశాంత్​ నటించిన 'సోంచిరియా' చిత్రం విడుదల వరకు ఈ బంధం కొనసాగిందని ఇన్​స్టాగ్రామ్​లో తెలిపాడు.

"కేదార్​నాథ్​' ప్రమోషన్ సమయంలో సుశాంత్​, సారా ప్రేమలో పడ్డారు. విడదీయలేనంతగా దగ్గరయ్యారు. వారిద్దరిదీ స్వచ్ఛమైన, చిన్నపిల్లల మనస్తత్వం. అలాంటి వారిని ఈ రోజుల్లో చూడటం చాలా అరుదు. సుశాంత్​, సారా.. వారి జీవితంలోని ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం ఇచ్చేవారు. కుటుంబం, స్నేహితులు, సహాయక సిబ్బందితోనూ గౌరవంగా ప్రవర్తించే వాళ్లు. 'సోంచారియా' విడుదల తర్వాత సుశాంత్​తో విడిపోవాలని సారా నిర్ణయం తీసుకుంది. దీని వెనుక బాలీవుడ్​ మాఫియా పాత్ర ఉంది"

- శామ్యూల్​ హౌకిప్​, సుశాంత్​ స్నేహితుడు

సుశాంత్​, సారా.. ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై నటి కంగనా రనౌత్​ టీమ్​ ట్విట్టర్​లో స్పందించింది. "సుశాంత్​, సారాల ప్రేమ వ్యవహారం మీడియాకు తెలుసు. అవుట్​డోర్​ షూటింగ్​లకు వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఇలాంటి హాని కలిగించే ఫ్యాన్సీ నెపోటిజం వ్యక్తులు బయటివారికి కలలు చూపిస్తూ.. వారిని బహిరంగంగా ఎందుకు వదిలేస్తున్నారు?" అని ప్రశ్నించింది కంగనా రనౌత్​ టీమ్​.

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​, సారా అలీఖాన్​ల ప్రేమ వ్యవహారం గురించి గతంలో ప్రచారం జరిగింది. కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం శామ్యూల్​ చేస్తున్న వాదనలు బీటౌన్​లో అలజడి సృష్టిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నటి సారా అలీఖాన్​ ఏ విధంగా స్పందిస్తుందోనని సుశాంత్​ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.