బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కూడా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులుగా సీబీఐ ముందు హాజరవుతోన్న రియా.. మంగళవారం ఐదో రోజూ విచారణ రానుంది. నటితో పాటు ఆమె సోదరుడు షౌహిక్ చక్రవర్తి కూడా నాలుగు రోజులు విచారణకు హాజరయ్యాడు.
నేడు రియా తల్లిదండ్రులు...
బిహార్ పాట్నాలో సుశాంత్ తండ్రి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో.. రియా తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని విచారించనుంది సీబీఐ. నేడు డీఆర్డీఓ గెస్ట్ హౌస్కు రియాతో పాటు వీరంతా హాజరుకానున్నారు. దిల్లీలో ఉన్న మరో సీబీఐ బృందం ఇవాళ సుశాంత్ కుటుంబసభ్యులను కలవనుంది.
34 గంటలు విచారణ...
సోమవారం నాడు రియను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ. జూన 8న సుశాంత్ ఫ్లాట్ వదిలి వెళ్లడంపై ఈ నటిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. సుశాంత్ తీసుకునే మందులు, మెడికల్ ట్రీట్మెంట్పై ప్రశ్నలు గుప్పించారు. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, రియా-సుశాంత్ మధ్య ప్రేమ, సుశాంత్ కుటుంబంతో రియాకు ఉన్న సాన్నిహిత్యంతో సహా పలు అంశాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 34 గంటల విచారణ ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి.