ETV Bharat / sitara

సుశాంత్​ మృతి కేసులో విచారణకు మహేశ్​ భట్​ - sushant singh latest news update

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మృతి కేసులో ప్రముఖ నిర్మాత మహేశ్​ భట్​ వాంగ్మూలాన్ని ముంబయి పోలీసులు రెండు రోజుల్లో తీసుకోనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. ఆయనతో పాటు కరణ్​ జోహర్​ మేనేజర్​ను విచారణకు రమ్మని చెప్పినట్లు స్పష్టం చేశారు.

Sushant case: Filmmaker Mahesh Bhatt to record his statement
సుశాంత్​ మృతి కేసులో విచారణకు మహేశ్​ భట్​
author img

By

Published : Jul 26, 2020, 6:44 PM IST

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత మహేశ్​ భట్ వాంగ్మూలాన్ని మరో రెండు రోజుల్లో తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. ఆయనతో పాటు, కరణ్​ జోహర్​ మేనేజర్​నూ విచారణకు పిలిచినట్లు పేర్కొన్నారు. అవసరమైతే కరణ్​ను స్వయంగా రమ్మని కోరనున్నట్లు స్పష్టం చేశారు. నటి కంగనా రనౌత్​కూ సమన్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

సుశాంత్​ చనిపోవడానికి అతని వృత్తిపరంగా ఎటువంటి కారణాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్​ రాజీవ్​ మసంద్​ సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు.

మరోవైపు ఇటీవలే డిస్నీ హాట్​స్టార్​లో విడుదలైన సుశాంత్​ ఆఖరి చిత్రం 'దిల్​ బెచారా' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.