ETV Bharat / sitara

సుశాంత్ మృతిపై దర్శకుడు భన్సాలీకి పోలీసుల ప్రశ్నలు - సుశాంత్ సింగ్ ఆత్మహత్య

యువనటుడు సుశాంత్ మృతిపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇతడితో పాటు కేసుతో సంబంధమున్న 30 మంది స్టేట్​మెంట్స్ తీసుకోనున్నారు.

సుశాంత్ విషయంలో దర్శకుడు భన్సాలీ వాంగ్మూలం
సుశాంత్ సింగ్ సంజయ్ లీలా భన్సాలీ
author img

By

Published : Jul 2, 2020, 7:12 PM IST

బాలీవుడ్​ యువహీరో సుశాంత్ సింగ్.. గత నెల 14వ తేదీన తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబయి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇతడితో పాటే ఈ కేసుతో సంబంధమున్న 30 మంది వాంగ్మూలాలు తీసుకోనున్నారు.

వీరిలో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు అతడి ప్రేయసి రియా చక్రవర్తి, క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా, యశ్​రాజ్ ఫిల్మ్స్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానో శర్మతో పాటు పలువురు ఉన్నారని పోలీస్ అధికారి వెల్లడించారు.

'కై.పో.చే' సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేసిన సుశాంత్.. 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'రబ్తా', 'కేదార్​నాథ్', 'సోన్​చిరియా' తదితర చిత్రాల్లో నటించినా టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ ధోనీ బయోపిక్​లో నటించి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా 'చిచ్చోరే'లో కనిపించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.