"సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో" అంటూ సాగే లిరికల్ గీతాన్ని 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. గ్రామీణ నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. పంజాబీ సింగర్ పరాక్ పాడాడు.
ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ రష్మిక. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: సూపర్‌స్టార్ మహేశ్ కోసం పంజాబీ సింగర్