ETV Bharat / sitara

సూర్య అభిమానులకు నిరాశ.. ట్రైలర్ రావట్లేదు - Soorarai Pottru movie update

జులై 23న తమిళ స్టార్​ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలోని ఓ పాట వీడియోను విడుదల చేయనున్నారు. 'కాటుక కన్నులే' అంటూ సాగే పాట నిమిషం నిడివిగల వీడియోను రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

surya fans disappointed
సూర్య బర్త్​డేకు 'కాటుక కన్నులే' పాట రిలీజ్​
author img

By

Published : Jul 19, 2020, 8:52 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా తమిళ స్టార్​ హీరో సూర్య నటిస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం విడుదల వాయిదా పడింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జులై 23 సూర్య పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్​ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే చిత్రబృందం అభిమానులకు షాకిచ్చింది.

సూర్య బర్త్​డే రోజున ట్రైలర్​ను విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ రోజున 'కాటుక కన్నులే' అనే నిమిషం నిడివిగల పాట వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రంలో టాలీవుడ్​ విలక్షణ నటుడు మంచు మోహన్​బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించగా.. సూర్య, బాలీవుడ్​ నిర్మాత గుణీత్​ మోంగ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఆకాశమే నీ హద్దురా' సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.