ETV Bharat / sitara

ఆస్కార్ రేసులో సూర్య 'జై భీమ్'తో పాటు మరో సినిమా - jai bhim in oscars

Oscars 2022 jai bhim: ఈసారి ఆస్కార్స్ ఫీచర్​ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి రెండు సినిమాలు ఎంపికయ్యాయి. అందులో సూర్య 'జై భీమ్', మోహన్​లాల్ 'మరక్కర్' ఉన్నాయి.

jai bhim, marakkar movie
జై భీమ్, మరక్కర్ మూవీ
author img

By

Published : Jan 21, 2022, 2:01 PM IST

Updated : Jan 21, 2022, 2:13 PM IST

Suriya jai bhim oscar: తమిళ హీరో సూర్య అరుదైన ఘనత సాధించారు. 'ఆకాశం నీ హద్దురా!' సినిమాతో గతేడాది ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైన సూర్య.. ఈ ఏడాది 'జై భీమ్' చిత్రంతో దానిని రిపీట్ చేశారు.

మొత్తంగా ఆస్కార్స్​ కోసం ఈసారి 276 సినిమాలు ఎంపికవగా, మన దేశం నుంచి ఈ ఏడాది రెండు చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవకాశం దక్కించుకున్నాయి. అందులో సూర్య 'జై భీమ్', మోహన్​లాల్ 'మరక్కర్' ఉన్నాయి. ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27-ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆస్కార్​కు​ ఎంపికైన వాటిలో 'బీయింగ్ ద రికార్డస్', బెల్​ఫాస్ట్, కోడా, డ్యూన్', 'ఎన్​ కాంటో', 'హౌస్ ఆఫ్ గస్సీ', 'ద పవర్​ ఆఫ్ ది డాగ్', 'ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2', స్పెన్సర్, 'స్పైడర్​మ్యాన్: నో వే హోమ్', 'వెస్ట్​ సైడ్ స్టోరీ' తదితర సినిమాలు ఉన్నాయి.

1993లో తమిళనాడులో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'జై భీమ్' నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రంలో వన్నియర్ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళ ప్రాంతీయ పార్టీ ఒకటి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అవేవి సినిమా ప్రేక్షకాదరణ పొందడాన్ని ఆపలేకపోయాయి. ఇందులో సూర్య, గిరిజనుల తరఫున పోరాడిన చంద్రు అనే న్యాయవాదిగా మెప్పించే ప్రదర్శన చేశారు.

Oscars 2022 marakkar: కుంజలి మరక్కర్-IV జీవితం ఆధారంగా తీసిన సినిమా 'మరక్కర్'. మోహన్​లాల్ టైటిల్​ రోల్ పోషించారు. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్​తో దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా మూడు జాతీయ అవార్డులు(ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైన్) కూడా దక్కించుకుంది.

94వ ఆస్కార్ నామినేషన్స్​ను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. మార్చి 27న హాలీవుడ్​లోని డాల్బీ థియేటర్​లో ఆస్కార్స్ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్​ను 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 21, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.