ETV Bharat / sitara

OTT movies: ఆ మూడు తెలుగు సినిమాలు ఓటీటీలో! - నారప్ప దృశ్యం 2 ఓటీటీ రిలీజ్​

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్​ ప్రొడక్షన్స్ సహ నిర్మాణంలో రూపొందిన 'నారప్ప', 'దృశ్యం 2', 'విరాటపర్వం' రిలీజ్​కు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయనున్నారని తెగ చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Suresh Production Films Narappa, Drushyam 2, Virataparvam sold for OTT release?
ఓటీటీ బాటలో సురేశ్​ ప్రొడక్షన్స్​ చిత్రాలు!
author img

By

Published : Jun 27, 2021, 5:01 PM IST

Updated : Jun 27, 2021, 7:25 PM IST

మరో మూడు తెలుగు సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సురేశ్​ ప్రొడక్షన్స్ సహా నిర్మాతగా ఉన్న నారప్ప, దృశ్యం 2, విరాటపర్వం.. ఈ జాబితాలో ఉన్నాయట. ఇవన్నీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నాయి. అయితే ఈ మూడు ఓటీటీ బాట పట్టాయనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఒకవేళ ఇదే నిజమైతే ఆ చిత్రాలను ఏ ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్​ చేస్తారనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది. కరోనా కారణంగా సినిమాహాళ్లు మూసివేయడం సహా ప్రజలు ఇప్పట్లో సినిమాహాళ్లకు వచ్చే సూచన కనిపించకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు వెంకటేశ్​ 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలను రూ.70 కోట్ల మొత్తానికి డిజిటల్​ ప్లాట్​ఫామ్​లకు అమ్మినట్లు సమాచారం.

అమెజాన్​ ప్రైమ్​లో 'నారప్ప'!

'అసురన్' రీమేక్​గా తీసిన 'నారప్ప'లో విక్టరీ వెంకటేశ్​, ప్రియమణి ప్రధానపాత్రలు పోషించారు. శ్రీకాంత్​ అడ్డాల దర్శకుడు. మే 14న థియేటర్లలో రావాల్సింది. కరోనా ఆంక్షల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమెజాన్​ ప్రైమ్​లో(Narappa in Amazon Prime) జులై 24న విడుదల కానున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

Suresh Production Films Narappa, Drushyam 2, Virataparvam sold for OTT release?
నారప్ప

దృశ్యం 2

మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేశ్​​, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మాతృకను రూపొందించిన జీతూ జోసెఫ్​ ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోని కారణంగా ఈ సినిమా ఓటీటీ(Drishyam 2 OTT release) బాటపట్టినట్లు తెలుస్తోంది.

విరాటపర్వం

రానా, సాయి ప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'విరాట ప‌ర్వం'. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్నిరోజుల నుంచి వార్త‌లొస్తున్నాయి. అయితే వీటిపై స్పందించిన దర్శకుడు వేణు.. థియేటర్​లోనే సినిమాను రిలీజ్​ చేస్తామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ ఇప్పుడు నిర్మాణసంస్థ సురేశ్​ ప్రొడక్షన్స్​ నిర్ణయంతో చిత్రాన్ని ఓటీటీ రిలీజ్​(Virata Parvam in OTT) చేయక తప్పడం లేదని తెలుస్తోంది! ఏప్రిల్ 30న ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండగా, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా ప‌డింది.

ఇదీ చూడండి.. Venkatesh: విక్టరీ వెంకటేశ్​తో డైరెక్టర్ వెంకటేశ్!

Last Updated : Jun 27, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.