ETV Bharat / sitara

ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే సురేఖా సిక్రీ - Surekha Sikri in sabarban mumbai

బుల్లితెర బామ్మ, జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రీ.. బ్రెయిన్​ స్ట్రోక్​ కారణంగా మంగళవారం ఆసుపత్రిలో చేరారు. బుధవారం నాటికి ఆమె పరిస్థితి సాధారణంగానే ఉన్నా... ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు సహా అభిమానులు కోరుతున్నారు.

ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే సురేఖా సిక్రీ
Surekha Sikri
author img

By

Published : Sep 9, 2020, 7:35 PM IST

బాలీవుడ్‌ సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు నటి సురేఖా సిక్రీ. మంగళవారం ఆమెకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం వల్ల ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ప్రస్తుతం సిక్రీ క్షేమంగానే ఉన్నారని ఆమె సన్నిహితులు చెప్పారు. అయితే కొన్ని రోజులు ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచాలని బుధవారం వైద్యులు సూచించినట్లు సమాచారం. సురేఖా 2018లో ఒకసారి పక్షవాతం బారినపడ్డారు.

ఆ వార్తలు అవాస్తవం..

సురేఖా సిక్రీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని వస్తోన్న వార్తలను ఆమె కుటుంబసభ్యులు ఖండించారు. చిత్రసీమకు చెందిన కొంతమంది సాయం చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఆయుష్మాన్​ పోస్టు...

సురేఖా సిక్రీ.. త్వరగా కోలుకోవాలని పోస్టు పెట్టాడు బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్​ ఖురానా. 2018లో వచ్చిన 'బదాయి హో' చిత్రంలో ఆయుష్మాన్‌కు నాన్నమ్మ దుర్గాదేవి కౌశిక్‌గా నటించారు సిక్రీ. ఈ చిత్రానికిగాను 66వ జాతీయ చలన చిత్ర అవార్డులలో 'ఉత్తమ సహాయ నటి'గా ఆమె అవార్డునూ అందుకున్నారు.

Ayushmann wishes Surekha Sikri's 'speedy recovery'
ఆయుష్మాన్​ పోస్టు

బాలీవుడ్​లో సినిమాలతో పాటు వెబ్​సిరీస్​ల్లోనూ నటించారు సిక్రీ. కరణ్‌ జోహర్‌, అనురాగ్‌ కశ్యప్‌ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌సీరీస్‌ చిత్రం 'ఘోస్ట్ స్టోరీస్‌'లో సురేఖ నటించి మెప్పించారు. ఆమె నటించిన కొన్ని సీరియల్స్ తెలుగులోనూ బాగా ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి 'చిన్నారి పెళ్లికూతురు'. అందులోనూ కీలకపాత్రలో నటించి మెప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.