Rajinikanth age: ఆయన చిన్న మేనరిజం చేస్తే చాలు.. థియేటర్ మొత్తం ఈలలు, గోలులు. ఆరడుగుల అందగాడు కాదు.. అలా అని సిక్స్‌ప్యాక్ కూడా లేదు.. డ్యాన్సులు కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన లెక్కలేనంతమంది. ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. డిసెంబరు 12న పుట్టినరోజు సందర్భంగా తలైవ జీవిత విశేషాలు మీకోసం.
*రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో పుట్టారు.
*కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసిన ఈయన.. నటనపై అమితమైన ఇష్టంతో చెన్నైకి వెళ్లారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు చేరారు.
*ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ 'అపూర్వ రాగంగల్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు.
*'అంతులేని కథ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు బాలచందరే దర్శకత్వం వహించారు.
![superstar rajinikanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13882120_rajinikanth-birthday-3.jpg)
*ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
*1977లో రజనీ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువశాతం ప్రతినాయక లక్షణాలున్న పాత్రలే కావడం విశేషం.
*దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం సినిమాలు.. రజనీకాంత్‌ను తెలుగు అభిమానుల మనసుల్లో స్థానం కల్పించాయి.
*చంద్రముఖి, శివాజీ, రోబో తదితర సినిమాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్‌కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి.
![superstar rajinikanth birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13882120_rajinikanth-birthday-2.jpg)
*సినిమాల షూటింగ్‌లు లేని సమయంలో హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. లేదంటే బెంగళూరులోని తన బాల్యమిత్రుడు రాజ్ బహుదూర్ ఇంటికి వెళ్లి చాలా సాధారణంగా గడుపుతారు.
*1981లో లతను రజనీకాంత్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు.
*2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్, 2019కిగానూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు రజనీకాంత్‌ను వరించాయి.
*మేనరిజంతోనే కాకుండా రజనీకాంత్ చెప్పిన చాలా డైలాగులు మనం వాడుక బాషలో ఉపయోగిస్తుంటాం.
*చివరగా 'అన్నాత్తే'(తెలుగులో 'పెద్దన్న') సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు.
![superstar rajinikanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13882120_rajinikanth-birthday-1.jpg)
ఇవీ చదవండి: