ETV Bharat / sitara

మనవడి సినిమాకు కృష్ణ దర్శకత్వం! - జయదేవ్ గల్లా సినిమాకు కృష్ణ దర్శకత్వం

టాలీవుడ్ ప్రముఖ హీరో కృష్ణ తాజాగా ఓ సినిమాకు దర్శకత్వం వహించారట. అయితే అది పూర్తిగా కాదు. ఓ సన్నివేశానికి. ఇంతకీ ఏ చిత్రానికో తెలుసా. అయితే చదివేయండి.

Superstar
కృష్ణ
author img

By

Published : Apr 9, 2020, 12:09 PM IST

టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు కృష్ణ గతంలో నటిస్తూనే దర్శకత్వం వహించారు. ఇన్నేళ్లకు మరోసారి మెగాఫోన్‌ పట్టారు కృష్ణ. అది కూడా ఆయన మనవడి చిత్రానికి. అయితే పూర్తి సినిమా కాదండోయ్‌.

అసలు విషయం ఏంటంటే? ఎంపీ జయదేవ్‌ గల్లా కుమారుడు అశోక్‌ హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. నిధి అగర్వాల్‌ నాయిక. సగానికిపైగా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలం వాయిదా పడింది. గతంలో షూట్‌ జరుగుతున్నప్పుడు కృష్ణ వెళ్లగా, దర్శకుడు శ్రీరామ్‌ అప్పుడు చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశాన్ని డైరెక్ట్‌ చేయాల్సిందిగా కృష్ణను కోరాడట. శ్రీరామ్‌ కోరికను కాదనలేక షూట్‌ చేశారు కృష్ణ. అది సినిమాకే కీలకమైన సీన్‌ అని సమాచారం. మరి కృష్ణ దర్శకత్వంలో ఆ సీన్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Superstar
అశోక్ గల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.