ETV Bharat / sitara

ఇండస్ట్రీలో 44 ఏళ్లు.. అప్పటికీ ఇప్పటికీ స్టైల్ అదే

author img

By

Published : Aug 18, 2019, 3:24 PM IST

Updated : Sep 27, 2019, 10:02 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​.. సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.

సూపర్​స్టార్ రజనీకాంత్

దక్షిణాదిలో ఎంతమంది స్టార్​లు పుట్టుకొచ్చినా.. స్టైల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్​స్టార్ రజనీకాంత్. హీరో అంటే ఇలానే ఉండాలి అనే హద్దును చెరిపేశాడు. ఆరడగుల పొడుగు, సిక్స్​ ప్యాక్ లేకున్నా అభిమానుల ఆదరణ అందుకోవచ్చని నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడిగా మారాడు. దశాబ్దాలుగా స్టైల్​, మేనరిజమ్స్​కి కేరాఫ్​ అడ్రస్​గా నిలిచి ఇండస్ట్రీలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.​

SUPER STAR RAJNIKANTH SPECIAL
సూపర్​స్టార్ రజనీకాంత్ ప్రత్యేకం

"నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది", "బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే", "ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు", "నా దారి రహదారి..." ఈ డైలాగ్​లు చాలు రజనీకాంత్ క్రేజ్ ఏంటో చెప్పడానికి.

తొలి అవకాశం ఇలా..!

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించాడు. తొలినాళ్లలో బస్​ కండక్టర్​గా చేస్తున్న సమయంలో నటనపై మక్కువ పెంచుకున్నాడు. మద్రాస్​ ఫిల్మ్​ ఇన్​స్టిట్యూట్​లో చేరి యాక్టింగ్​ కోర్సులో డిప్లమో చేశాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన 'అపూర్వ రాగంగల్'(1975)లో తొలి అవకాశం దక్కించుకున్నాడు.

SUPER STAR RAJNIKANTH SPECIAL
సూపర్​స్టార్ రజనీకాంత్ ప్రత్యేకం

అనంతరం కన్నడలో ‘కథా సంగమ’... తెలుగులో మళ్లీ బాలచందర్​తో ‘అంతులేని కథ’, తమిళంలో ‘మూడ్రు ముడిచు’ అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1977లో రజనీకాంత్.. 15 సినిమాల్లో నటిస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలున్న పాత్రలే చేశాడు. తొలుత ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకొన్న తలైవా.. ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్నాడు.

SUPER STAR RAJNIKANTH SPECIAL
సూపర్​స్టార్ రజనీకాంత్ ప్రత్యేకం

80, 90వ దశకాల్లో సూపర్​స్టార్ చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. ‘దళపతి’, ‘నరసింహ’, ‘బాషా’, ‘ముత్తు’, ‘పెదరాయుడు’, ‘అరుణాచలం’ తదితర చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విశేష ప్రజాదరణను సొంతం చేసుకొన్నాయి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి.

ఎంత పేరున్నా.. సాధారణ జీవితమే

రజనీకాంత్‌ కథానాయకుడిగా కోట్లాది మంది గుండెల్లో ఉన్నా... తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకొన్నా... సాధారణ జీవితాన్నే ఇష్టపడతాడు. బాల్యమిత్రుడి ఇంటికి వెళ్లి, వాళ్లతో కలిసి గడపడం, హిమాలయాలకు వెళ్లి ధాన్యం చేయడం అతడి అలవాటు.

SUPER STAR RAJNIKANTH
సాధారణ గెటప్​లో రజనీకాంత్

కుటుంబ నేపథ్యం

1981లో లతను వివాహం చేసుకున్నాడు రజనీకాంత్‌. వీరి కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య. వీరిద్దరూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీ హీరోగా వచ్చిన 'కొచ్చాడయాన్'కు సౌందర్యే దర్శకురాలు కావడం విశేషం.

అవార్డులు

సూపర్​స్టార్ రజనీకాంత్.. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్‌ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాడు.

2017లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీకాంత్.. వాటితో పాటే సినిమాలు చేస్తూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఏఆర్ మురగదాస్​ తెరకెక్కిస్తున్న 'దర్బార్​'లో పోలీసుగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

SUPER STAR RAJNIKANTH SPECIAL
సూపర్​స్టార్ రజనీకాంత్ ప్రత్యేకం

ఇది చదవండి: 'రజనీకాంత్​లా నేనూ పెద్ద హీరో అవుతా...'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: G & B Arena, Malilla, Sweden - 17th August 2019
1. 00:00 Riders gathered before start of national anthem of Sweden
2. 00:05 Swedish flag
3. 00:08 Crowd
4. 00:11 Heat 6: Patryk Dudek clips the back of leader Mikkel Michelsen's bike and causes crash that also takes down Max Fricke and Fredrik Lindgren  
5. 01:00 Heat 20: Jason Doyle crashes and is disqualified, meaning the former world champion misses out on the semis
6. 01:19 Doyle reaction
7. 01:25 Final: Lindgren wins, ahead of Leon Madsen
8. 02:37 Podium celebrations
SOURCE: Eurosport
DURATION: 02:59
STORYLINE:
Home favourite Fredrik Lindgren won Saturday's Scandinavian FIM Speedway GP in Malilla.
Russia's Artem Laguta had been the star of the heats, with four wins and a second place, but he brought up the rear in the final.
Leon Madsen had been one of three men sharing the World Championship lead with 61 points at the start of the evening. But second place here enabled the Dane to open up a six-point gap over Bartosz Zmarzlik.
Maciej Janowski of Poland was third on the night.
Last Updated : Sep 27, 2019, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.